తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. సూర్య లేటెస్ట్గా కమల్ హాసన్, విక్రమ్ సినిమాలో నటించారు. Photo : Twitter .
అది అలా ఉంటే సూర్య, జ్యోతికల కూతురు, కొడుకుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య, జ్యోతికలకు దియా (కూతురు) దేవ్ (కొడుకు) ఇద్దరు సంతానం. ఇటీవల జ్యోతిక, దియా, దేవ్ తమ పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య జ్యోతికలు 11 సెప్టెంబర్ 2006 న వివాహం చేసుకున్నారు. Photo : Twitter .
ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వనంగాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది. మరో కీలక పాత్ర కోసం తెలుగు హీరోయిన్ కృతి శెట్టిని తీసుకున్నారు. ఓ షెడ్యూల్ కూడా జరుపుకున్న ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పటికే ఈ విషయంలో ఓ ప్రకటన విడుదలైంది. Photo : Twitter
అయితే ఈ సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పుల కారణంగా ఇటు సూర్యకు, అటు దర్శకుడు బాలాకు మధ్య భేదాప్రాయాలు రావడంతో సున్నితంగా సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. కథలో కొన్ని మార్పుల కారణంగా ఈ సినిమా ఇక ఏమాత్రం సూర్యకు సరిపోదని.. మరో హీరోతో ఈ సినిమా రానుందని ఈ సినిమా దర్శకుడు బాలా ప్రకటించారు. అయితే త్వరలోనే మంచి కథతో మరోసారి సూర్యతో పనిచేస్తానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. సూర్య గతంలో (Bala) బాలా దర్శకత్వంలో శివ పుత్రుడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ప్రస్తుతం సూర్య, వెట్రీ మారన్ దర్శకత్వంలో వడివాసల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక సూర్య ఇతర సినిమాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్యకు సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దురా)లో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం సూర్య ఓ రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఒకటి శివ దర్శకత్వంలో వస్తుండగా.. మరోకటి వెట్రిమారన్ డైరెక్షన్లో వస్తున్న వాడివాసల్. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. Photo : Twitter
ఇక సూర్య (Suriya) ఆ మధ్య ET (ఈటి) Etharkkum Thunindhavan (ఎతర్క్కుమ్ తునిందవన్) మూవీతో పలకరించారు. ఈ సినిమా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. . Photo : Twitter
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. సూర్య గత రెండు సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయం సాధించాయి. ఇక ఈటీ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషించారు. Photo : Twitter
సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా.. విషయానికి వస్తే.. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్. గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. తెలుగులో ఆకాశం నీ హద్దురా గా డబ్ అయ్యింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించాడు. Photo : Twitter
సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో మలయాళీ భామ అపర్ణ బాలమురళి హీరోయిన్ గా చేసింది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన తెలుగు మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేసింది. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ అయ్యింది. Photo : Twitter
అంతేకాదు ‘సూరారై పొట్రూ’ సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. ఈ సినిమాలో మహా పాత్రలో సూర్య ఇరగదీశాడు. సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ అదరగొట్టాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన 'ఆకాశం నీ హద్దురా'లో సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశీ నటించారు. ఇక సూర్య తన 42వ సినిమాను శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్‌ను జరుపుకుంటోంది. Photo : Twitter