తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. సూర్య లేటెస్ట్గా కమల్ హాసన్, విక్రమ్ సినిమాలో నటించారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే.. సూర్య(Suriya) తన భార్య జ్యోతిక(Jyothika) కలిసి కొస్టారికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ఈ జంట అడ్వెంచర్స్ చేస్తున్నారు. సినిమా పనుల నుంచి కాస్త విరామం తీసుకున్న ఈ స్టార్ దంపతులు తాజాగా సెంట్రల్ అమెరికాలోని కోస్టారికాకు దేశానికి టూర్ వెళ్లారు. అక్కడి కోస్టారికాలో ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా ట్రెక్కింగ్, బోటింగ్ అడ్వెంచర్స్ చేస్తున్నారు. Photo : Twitter
ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’లో సూర్య.. రోలెక్స్ సర్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. ఇక ప్రస్తుతం ఆయన బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, ‘ఆకాశమే నీ హద్దురా!’ హిందీ వెర్షన్‌లోని కీలకపాత్రలో సూర్య ఓ చిన్న క్యామియోలో కనిపించనున్నారు. Photo : Twitter
సూర్య (Suriya. తాజాగా ఈయన ET (ఈటి) Etharkkum Thunindhavan (ఎతర్క్కుమ్ తునిందవన్) మూవీతో పలకరించారు. ఈ సినిమా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. Photo : Twitter
సూర్య గత రెండు సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయం సాధించాయి. తాజాగా నటించిన సినిమా థియేట్రికల్ రిలీజైవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషించారు. Photo : Twitter
ఆ సినిమా బాలతోపాటు సూర్యకు మంచి పేరును తెచ్చింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తోంది. దీంతో మంచి అంచనాలున్నాయి. ఇక తాజా సినిమా విషయానికి వస్తే.. సూర్య కోసం (Bala) బాలా మంచి కథ రాశాడని తెలుస్తోంది. అంతేకాదు సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా జ్యోతికతో పాటు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) కూడా నటించనున్నారు. మరో నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter