2021 Top IMDB Movies | ప్రతీ యేడాది మాదిరే ఈ సారి కూడా టాప్ 10 భారతీయ సినిమాలు ఏంటి అని లెక్క గట్టింది IMDB సంస్థ. బాక్సాఫీస్ లెక్కలతో పాటు ఆ సినిమాలు పర్ఫార్మ్ చేసిన విధానం.. ప్రశంసలు.. కంటెంట్ బట్టి టాప్ 10 ఇండియన్ మూవీస్ లెక్క తీసింది. అందులో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సినిమా టాప్ 1లో నిలిచింది. టాప్ 2లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సర్ధార్ ఉధమ్’ సినిమా నిలిచింది. ఇక 10వ స్థానంలో ధనుశ్ హీరోగా నటించిన ‘కర్ణన్’ నిలిచింది. మిగతా స్థానాల్లో ఏయే భారతీయ సినిమాలున్నాయో మీరు ఓ లుక్కేయండి. (Twitter/Photo)
Top 1 జై భీమ్ | సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB (Indian Movie Data Base) లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జై భీమ్’ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 9.3/10 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉన్న ‘ది షాషాంక్ రిడంప్షన్’ సినిమా రెండో స్థానానికి పడిపోయింది. ఇపుడు ఆ స్థానంలో ‘జై భీమ్’ వచ్చి చేరింది. (Twitter/Photo)
Top 7 Drishyam 2 | కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అలాంటి అద్భుతమైన సినిమా దృశ్యం. మలయాళంలో ఏడేళ్ల కింద వచ్చిన ఈ సినిమా 7 భాషల్లో రీమేక్ అయి రికార్డులు తిరగరాసింది. అంతేకాదు రీమేక్ అయిన ప్రతీ భాషలోనూ విజయం సాధించిన ఏకైక చిత్రం దృశ్యం. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘దృశ్యం 2’ సినిమా IMDB రేటింగ్‌లో 8.6/10 రేటింగ్‌తో టాప్ 7లో నిలిచింది. (Twitter/Photo)