Suriya - ET OTT : తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన ET (ఈటి) Etharkkum Thunindhavan (ఎతర్క్కుమ్ తునిందవన్) మూవీతో పలకరించారు. ఈ సినిమా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. Photo : Twitter
పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం, సన్ నెక్ట్స్తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 7, 2022న విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. Photo : Twitter
ఈయన గత రెండు సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయం సాధించాయి. తాజాగా నటించిన సినిమా థియేట్రికల్ రిలీజైవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషించారు. Photo : Twitter
సూర్య (Suriya) ఈటి సినిమా హిట్ తర్వాత తాజాగా కొత్త సినిమాను మొదలు పెట్టారు. సూర్య (Suriya) తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు తమిళనాడులోని కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్య 41వ సినిమాగా వస్తోంది. సూర్య గతంలో (Bala) బాలా దర్శకత్వంలో శివ పుత్రుడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ఆ సినిమా బాలతోపాటు సూర్యకు మంచి పేరును తెచ్చింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తోంది. దీంతో మంచి అంచనాలున్నాయి. ఇక తాజా సినిమా విషయానికి వస్తే.. సూర్య కోసం (Bala) బాలా మంచి కథ రాశాడని తెలుస్తోంది. అంతేకాదు సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా జ్యోతికతో పాటు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) కూడా నటించనున్నారు. మరో నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter
ఇక సూర్య ఇతర సినిమాల విషయానికి వస్తే.. సూర్య నటించిన జై భీమ్ (Jai Bhim) మంచి పేరును తెచ్చింది. సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. Photo : Twitter
ఇక జైభీమ్ కంటే ముందు సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. Photo : Twitter
అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో డీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని కూడా 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు. Photo : Twitter