Suriya - ET : సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎతర్కుమ్ తునిందవన్’. గత కొన్నేళ్లుగా సూర్య నటించిన సినిమాలను థియేట్రికల్‌గా కాకుండా.. నేరుగా ఓటీటీ వేదిగా విడుదల చేసారు. తాజాగా ఈయన నటించిన ET చిత్రాన్ని రెండేళ్ల తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్ విడుదల కానుంది. (Twitter/Photo)
‘ET’ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకుంటున్నారట. దీనికి సంబంధించి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సూర్య గతంలో “బ్రదర్స్” అనే సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రానికి ఆయన స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమాకు సంబంధించి తెలుగు హక్కులను ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) దక్కించుకుంది. (Twitter/Photo)
గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని సూర్య ఈయన నటించిన ‘సూరారై పొట్రు’ సినిమాను థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఒకేసారి తమిళంలో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసారు. ఇక్కడ కూడా ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘జై భీమ్’ చిత్రాన్ని కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఈ చిత్రంలో సూర్య సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ తదితరులు నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇమాన్ సంగీతం అందించారు. (Twitter/Photo)
‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత సూర్య నటించి మరో చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim). జై భీమ్.. ప్యాన్ ఇండియా లెవల్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రూ పాత్రలో అదరగొట్టారు. జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ కెేటగిరిలో మన దేశం తరుపున సెలెక్ట్ అయింది. (Twitter/Photo)
ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB (Indian Movie Data Base) లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జై భీమ్’ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 9.3/10 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉన్న ‘ది షాషాంక్ రిడంప్షన్’ సినిమా రెండో స్థానానికి పడిపోయింది. ఇపుడు ఆ స్థానంలో ‘జై భీమ్’ వచ్చి చేరింది. మొత్తంగా సూర్య వరుసగా రెండు ఓటీటీ రిలీజ్‌ల తర్వాత ఇపుడు మళ్లీ కొత్త సినిమా ‘ET’ మూవీని థియేట్రికల్ రిలీజ్‌తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని చూస్తున్నాడు. (Twitter/Photo)