Sudha Kongara: సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాతో దర్శకురాలిగా మంచి పేరు సంపాదించుకుంది సుధ కొంగర. ీ ఈ సినిమా జాతీయ అవార్డుతో పాటు ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్లు సూర్య, అపర్ణ బాలమురళి ఉత్తమ నటీనటులుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా దర్శకురాలు తాజాగా తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని ఆమె తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది.
ఐతే.. సుధ కొంగర తన చేతికి ఎలా ఫ్యాక్చర్ అయిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈమె అక్షయ్ కుమార్తో హిందీలో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తెరకెక్కిస్తోంది. ఇక సూర్యతో తెరకెక్కించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో హిందీలో ‘ఉడాన్’ పేరుతో విడుదలైంది. ఆల్రెడీ హిందీ ప్రేక్షకులు చూసేసిన సినిమాను ఇపుడు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. (Twitter/Photo)
‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను తమిళంలో ‘సూరాయై పొట్రు’ పేరుతో ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య,జ్యోతిక నిర్మించారు. అదే సినిమాను హిందీలో విక్రమ్ మల్హోత్రతో కలిసి సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథను ఆధారంగా కాస్త ఫిక్షన్ జోడించి సుధ కొంగర ఈ చిత్రాన్ని డైరెక్టర్ చేసారు. (twitter/Photo)
ఒకప్పుడు ఈమె సినిమాలు చూసి ఎందుకు చేస్తారో ఇలాంటి సినిమాలు అంటూ ఆమెను అవమానించిన వాళ్లు లేకపోలేరు.. హేళన చేసిన వాళ్లు ఉన్నారు. కథ కాకరకాయ్ లేని సినిమాలు ఎందుకు చేస్తుందో ఈమె అంటూ సుధను విమర్శించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా ఇప్పుడు దూసుకొచ్చింది సుధ. ఆమె సక్సెస్ చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు.
తొలి సినిమా వచ్చిన రెండేళ్లకు తమిళంలో ద్రోహి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది సుధా. థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా. మూడేళ్ల కింద సాలా ఖడూస్ సినిమాతో దేశాన్ని తనవైపు తిరిగి చూసేలా చేసింది సుధా. ఈ చిత్రంలో నటించిన రితికా సింగ్కు మంచి పేరు వచ్చింది. అంతేకాదు గురుగా తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయి ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది ఈ చిత్రం.
సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురాతో మరో విజయం అందుకుంది. అప్పటి వరకు సరైన విజయం లేని ఈ హీరోకు సుధ ఆ లోటు తీర్చింది. కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో OTTలో విడుదల చేసారు ఈ చిత్రాన్ని. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం సంచలన టాక్ వచ్చింది. అందులో కొన్ని సన్నివేశాలను సుధా తెరకెక్కించిన తీరు చూసి అంతా ఫిదా అయ్యారు. ఈమె దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడుకుంటున్నారు.
డక్కన్ ఎయిర్ అధినేత గోపీనాథ్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని వాటికి స్క్రీన్ ప్లే రాసుకుంది సుధా కొంగర. ఎమోషనల్ ఎంటర్టైనర్గానే కాకుండా స్పూర్థిదాయకమైన కథతో ఇప్పుడు ఆకాశం నీ హద్దురా సంచలనం రేపుతుంది. అమెజాన్లో ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ హిట్ అయితే ఇదే. సూర్య సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో ఈమె రతన్ టాటా జీవితంలపై ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అక్షయ్ సినిమా తర్వాత ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. (Twitter/Photo)