సెలబ్రిటీలకు సాధారణ ప్రజలకు మధ్యదూరం తగ్గించడంలో సామాజిక మాద్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సామజిక మాధ్యమాల వేదికగా తమ తమ అభిమాన హీరోలతో నేరుగా మాట్లాడే సదుపాయం ప్రేక్షకులకు కలిగింది. అయితే ఈ సామజిక మాధ్యమాలను ఫుల్లుగా వాడేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది సురేఖావాణి డాటర్ సుప్రిత.
ఇక సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీలు కుదిరినప్పుడల్లా పబ్ లకు వెళ్లడం, స్నేహితులతో కలిసి చిల్ కావడం లాంటివి చేస్తుంటారు. టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతోంటారు.