పోకిరి ముందు వరకు మహేష్ బాబు టాలీవుడ్ యువ హీరోల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు ఈయన్ని అందరు ప్రిన్స్ మహేష్ బాబు అంటూ సంభోదించేవారు. కానీ పోకిరి సూపర్ సక్సెస్‌తో మహేష్ బాబు రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ సూపర్ స్టార్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ సినిమా సాధించిన రికార్డుల విషయానికొస్తే.. (Twitter/Photo)
‘పోకిరి’ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఒకే మూసలో ఉన్న మహేష్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది పోకిరి చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, ఇలియానా గ్లామర్, బ్రహ్మానందం కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. (Twitter/Photo)
పోకిరి మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమా వచ్చి అప్పుడే 16 ఏళ్లైపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం ఎప్రిల్ 28, 2006న విడుదలైంది. తొలిరోజు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. మొదటి వారం కలెక్షన్స్ కూడా ఊహించినంత లేవు. కానీ రెండో వారానికి సినిమా పుంజుకుంది. అది 175 రోజుల వరకు ఆగలేదు. (Twitter/Photo)
దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రూ. 16 కోట్లకు అమ్మారు. దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి ఇండస్ట్రీ రికార్డులకు ఎక్కింది. అప్పటి వరకు తెలుగు సినిమా కనీవినీ ఎరుగని రికార్డులను సాధించి ఔరా అనిపించింది పోకిరి. ఒకటి రెండు కాదు ఏకంగా రూ. 40 కోట్లు షేర్ వసూలు చేసి ప్రిన్స్‌గా ఉన్న మహేష్ బాబును సూపర్ స్టార్‌గా మార్చేసింది. ఎవడు కొడితే దిమ్మతిరిగి బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోతాయో వాడే పండుగాడు అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా కాలర్ ఎగరేసుకున్నారు. (Twitter/Photo)
ఇక ‘పోకిరి’ చిత్రం సంవత్సరానికి పైగా నడిచి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.అప్పట్లో ఈ సినిమాను 16 కోట్లకు అమ్మారు. అప్పటికి అది చాలా పెద్ద మొత్తమే. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఏకంగా 39 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా బయ్యర్లకు రూ. 24 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. పండుగాడి పేరు చెప్పుకుని డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా సెటిల్ అయిపోయారు.(Twitter/Photo)
ముందుగా ఈ సినిమాలో సూపర్ ఫేమ్ అయేషా టకియాను అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. ఆ తర్వాత కంగనాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అప్పటికే ‘గ్యాంగ్ స్టర్’ సినిమాకు డేట్స్ కేటాయించడంతో ఈ సినిమా చేయలేకపోయింది. ఆ తర్వాత ఇలియాను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. తెలుగు పోకిరిలో ఛాన్స్ మిస్ చేసుకున్న అయేషా.. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘వాంటెడ్’లో హీరోయిన్గా నటించింది. ‘పోకిరి’ చిత్రంలో మహేష్ బాబు, ఇలియానా మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు అన్ని ప్రేక్షకులను అలరించాయి. (Twitter/Photo)
కన్నడలో దర్శన్, ప్రణీత హీరో, హీరోయిన్లుగా పోకిరి టైటిల్‌తో రీమేక్ అయింది. అక్కడ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. అటు బెంగాలీ, బంగ్లాదేశ్‌లో కూడా ఈ సినిమాను రీమేక్ చేసి సక్సెస్ అయింది. ఒక సినిమా రీమేక్ అయిన అన్ని భాషల్లో హిట్ అవ్వడం చాలా రేర్. అలా హిట్టైన అతి కొద్ది సినిమాల్లో ‘పోకిరి’ సినిమా చోటు సంపాదించుకుంది. ‘పోకిరి’ చిత్రంతో తొలిసారి ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు చిత్రాల ప్రభంజం మొదలైంది. (Twitter/Photo)