Krishna: బాలయ్య సమర్ఫణలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రానికి 41 యేళ్లు..
Krishna: బాలయ్య సమర్ఫణలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రానికి 41 యేళ్లు..
సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా విడుదలై నేటికి 40 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా విడుదలై నేటికి 41 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు బాలయ్య తన అమృతా ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించారు. (Twitter/Photo)
2/ 11
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 167వ చిత్రం ‘చుట్లాలున్నారు జాగ్రత్త’. నేరము శిక్ష, ’ఈనాటి బంధం ఏనాటిదో’ తర్వాత కృష్ణ.. సీనియర్ నటుడు బాలయ్యకు చెందిన అమృతా ఫిలిమ్స్ బ్యానర్లో తెరకెక్కిన చిత్రం ‘చుట్టాలున్నారు జాగ్రత్త’. ఈ సినిమాకు బాలయ్య సమర్పకుడిగా వ్యవహరించారు. (Twitter/Photo)
3/ 11
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి, గీత హీరోయిన్స్‌గా నటించారు. (Twitter/Photo)
4/ 11
‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రాన్ని బి.వి.ప్రసాద్ డైరెక్ట్ చేసాడు. (Twitter/Photo)
5/ 11
కృష్ణ నటించిన ‘చుట్టలున్నారు జాగ్రత్త’ కాన్సెప్ట్‌తో తెలుగులో ఆ తర్వాత ఎన్నో చిత్రాలు తెరకెక్కి సూపర్ హిట్టయ్యాయి. (Twitter/Photo)
6/ 11
తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘పొక్కిరి రాజా’ గా రీమేక్ అయింది. తమిళంలో శ్రీదేవి పాత్రను శ్రీదేవి చేసింది. కవిత పాత్రలో రాధిక నటించింది. (Twitter/Photo)
7/ 11
తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ‘మవాలీ’ పేరుతో రీమేక్ చేసారు. ఈ చిత్రంలో తెలుగులో శ్రీదేవి చేసిన పాత్రను హిందీలో జయప్రద చేసింది. తెలుగులో కవిత చేసిన పాత్రను బాలీవుడ్లో శ్రీదేవి చేయడం గమనార్హం. (Twitter/Photo)
8/ 11
చుట్టాలున్నారు జాగ్రత్త చాలా కేంద్రాల్లో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది. (Twitter/Photo)
కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథ్ అద్భుతమైన బాణీలు అందించారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో రావు గోపాల రావు, నూతన ప్రసాద్, సూర్యకాంతం నటించారు. (Twitter/Photo)
11/ 11
సూపర్ స్టార్ కృష్ణ,శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. (Twitter/Photo)