Khushi Kapoor: రాజ హంసలా ఖుషీ కపూర్....యువరాణిని తలపిస్తోన్న శ్రీదేవి తనయ..

Khushi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్న టాక్ విన్పిస్తోంది.