Prabhas - Mahesh Babu | ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. ఇక ఈ మూవీ జనవరి 14న విడుదల కావాల్సింది. ఓమైక్రాన్ కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఈ సినిమాను మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ మహేష్ బాబు మాట సాయం తీసుకుంటున్నాడట. (Twitter/Photo)
తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ని ఐమాక్స్ థియేటర్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే 90 శాతం టిక్కెట్స్ అమ్ముడు పోయాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను మార్చి 2 నుంచి చేయనున్నారు. సినిమా కధాంశానికి తగినట్లు అప్పటి వాతావరణంలోపాటు, అప్పట్లో ఉపయోగించిన వస్తువులను కూడా రీ క్రీయేట్ చేసారు. (Twitter/Photo)
1970 నాటి ఇటలీ చాయాలు సినిమాలో అలా దించేశారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాలో ఆర్ట్ అంశాలపైనే సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. . 1970 లో నాటి ఇటలీని మళ్లీ రీ క్రియేట్ చేసారు. కృష్ణంరాజు సమర్ఫణలో గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు మరో ఐదారు భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. (Twitter/Photo)
రాధే శ్యామ్ కథ పరంగా చూసుకుంటే 1970 లో ఇటిలీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాధే శ్యామ్ కోసం సరైన లొకేషన్లను గుర్తించడం, అద్భుతమైన సెట్లను రూపొందించడం లో చిత్ర యూనిట్ ఎంతో కష్టపడిందనే చెప్పాలి. (Twitter/Photo)
ఎందుకంటే చాలా సినిమాల్లో ఒక సన్నివేశాన్ని లేదా కనీసం ఒక పాటను లాంటి మాత్రమే ఫారిన్ లొకేషన్లో షూట్ చేస్తూ ఉంటారు , అయితే ఇక్కడ ఎక్కువ కథ 1970ల నాటి ఇటలీలో జరుగుతుంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కు అప్పటి పరిస్థితిలు పునఃసృష్టి చేయడం సవాలుతో కూడుకున్న పనిగా మారిందని చెబుతున్నారు చిత్రయూనిట్. (Twitter/Photo)
"సినిమాను వీలైనంత నమ్మకంగా, ఫర్ఫెక్ట్ గా చూపించడానికి చాలా పరిశోధన చేశారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఇటలీలో చాలా ప్రాంతాల్లో షూట్ చేశారు. దాదాపు 70 మంది బృందం ఇటలీలో పర్యటించి సన్నివేశాలకు తగినట్లు సెట్స్ ను రూపోందించారు. ఈ చిత్రానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. (Radhe Shyam Trailer/Photo)
ఈ సినిమాలో చూపించబోతున్న ప్రతి వస్తువు 1970లలో ఇటలీలో ఉండే వస్తువులకు, ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండబోతున్నాయి. ఫర్నీచర్, టపాకాయల, టెలిఫోన్, అద్దం వరకు, రాధే శ్యామ్‌లో అప్పటి సంస్కృతిని వీలైనంత దగ్గరగా ఉండేలా చూడడానికి చాలా కష్టపడింది ఆర్ట్ టీమ్. మరి ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు ఫలితం అందుకుంటుందో చూడాలి. (Twitter/Photo)