Mahesh Babu: మహేష్ బాబు సినీ కెరీర్లో ఈ రోజు వెరీ వెరీ స్పెషల్.. పండగ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్. సరిగ్గా 42 ఏళ్ల క్రితం దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’ చిత్రంలో మహేష్ బాబు తొలిసారి నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మహేష్ బాబు వయసు 4 యేళ్లు. నేటితో ఈ సినిమా విడుదలై 42 యేళ్లు పూర్తి చేసుకుంది. . (Twitter/Photo)
టాలీవుడ్ ప్రిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్‌స్టార్ ఎదిగారు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, కొద్దికాలంలోనే తనదైన స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారారు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచేసే వయసు 46 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. 46 ఏళ్లలో నటుడిగా 42 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు మహేష్ బాబు. హీరోగా 22 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. (Twitter/Photo)
సరిగ్గా 42 ఏళ్ల క్రితం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రంగా రూపొందిన ‘నీడ’ చిత్రంలో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు మహేష్ బాబు.ఈ సినిమా వచ్చి నేటితో 42 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మహేష్ బాబు 42 ఇయర్స్ జర్నీని ట్రెండ్ చేస్తున్నారు. (Twitter/Photo)
1979లో విడుదలైన ‘నీడ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన మహేష్ బాబు... ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణ నటించిన కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సోలో ఎంట్రీ ఇచ్చిన మహేష్... ‘మురారి’ సినిమాతో మంచి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇపుడు టాలీవుడ్ టాప్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. (Twitter/Photo)
అంతేకాకుండా తన నటనకు ఏడు నంది అవార్డులు అందుకున్న మహేష్... ప్రస్తుత తరంలో అత్యధిక నంది అవార్డులు సొంతం చేసుకున్న హీరోగానూ రికార్డు క్రియేట్ చేశారు. బాల నటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. హీరోగా 26 చిత్రాల్లోనటించారు. మొత్తంగా 42 ఏళ్ల కెరీర్లో 35 చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. (Twitter/Photo)
తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాదు బిజినెస్ చేయడంలోనూ ఆరితేరిపోయారు. ముఖ్యంగా నటనతో పాటే ఇతర రంగాల్లోనూ సత్తా చూపిస్తున్నారు. అందులో అందరికంటే ముందున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు.. వ్యాపారాలు చేయడంలో కూడా ముందున్నారు. సినిమాలతో పాటు మరోవైపు నిర్మాణ వ్యవహారాలతో పాటు వ్యాపారాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. (Twitter/Photo)
‘సర్కారు వారి పాట’ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ విషయానికొస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, త్రివిక్రమ్ బాండింగ్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జంట కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. (Twitter/Photo)