Mahesh Babu -Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ ఆ రికార్డు.. రమేష్ బాబుకు సాధ్యమైంది. అవును సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ముందుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రమేష్ బాబు. కానీ హీరోగా రమేష్ బాబు సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత సూపర్ స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రి తగ్గ తనయుడిగా రాణించారు. హీరోగా అంతగా సక్సెస్ కాలేని దివంగత రమేష్ బాబు.. ఓ విషయంలో తమ్ముడు మహేష్ బాబుకు కూడా సాధ్యం కానీ రికార్డును నెలకొల్పారు. (Twitter/Photo)
గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రమేష్ బాబు.. ఈ శనివారం (8-1-2022)న తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త సూపర్ స్టార్ అభిమానులను తీవ్ర దిగ్భాంతిని గురి చేసింది. ఈయనకు భార్య మృదుల, కుమార్తె భారతి, కుమారుడు జయకృష్ణ ఉన్నారు. ఈయన 5 యేళ్ల వయసులో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోస్ తొలి చిత్రం ‘అగ్ని పరీక్ష’ సినిమాలో చిన్ననాటి కృష్ణ పాత్రలో బాల నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘దేవుడు చేసిన మనుషులు’, అల్లూరి సీతారామరాజు’, దేవదాసు, కురుక్షేత్రం, దొంగలకు దొంగ వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. ఇక ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో మాత్రం చిన్ననాటి ఎన్టీఆర్ పాత్రలో నటించడం విశేషం. (Twitter/Photo)
ఇక 15 ఏళ్ల వయసులో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతోనే మహేష్ బాబు బాల నటుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సినిమా ఫంక్షన్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి చేతులు మీదుగా రమేష్ బాబు అవార్డు కూడా అందుకున్నారు. ఇక మహేష్ బాబు తండ్రి కాని తండ్రి మరణించడంతో ఎమోషనల్ అయ్యాడు మహేష్ బాబు. అంతకంటే దారుణం మరోటి ఏంటంటే.. కరోనా కారణంగా కనీసం కడసారి చూపులకు కూడా నోచుకోకపోవడం. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సూపర్ స్టార్.. రమేష్ బాబు అంత్యక్రియలకు మాత్రమే కాదు.. కనీసం పార్థిక దేహాన్ని చూడ్డానికి కూడా రాలేదు. (Twitter/Photo)
సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ ఆ రికార్డు.. రమేష్ బాబుకు సాధ్యమైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్... తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు ఉన్నారు. వీళ్లిద్దరి సరసన ఆరుగురు హీరోయిన్స్ నటించారు.
మొత్తంగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించిన కథానాయికలతో రమేష్ బాబు యాక్ట్ చేసారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఏ హీరోయిన్‌తో హీరోగా నటించలేదు. ఇక మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చే వరకు సూపర్ స్టార్ కృష్ణ ఫేడౌట్ అయ్యారు. హీరోగా యాక్టివ్‌గా లేరు. అందుకే నటించలేకపోయారు మహేష్ బాబు. ఓ రకంగా సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించిన హీరోయిన్స్‌తో మహేష్ బాబుకు దక్కని ఆ రికార్డు.. అన్నయ్య రమేష్ బాబుకు దక్కడం విశేషం. (Twitter/Photo)