Home » photogallery » movies » SUPER STAR KRISHNA WIFE LEGENDERY DIRECTOR VIJAYA NIRMALA STATUE UNVEILED ON HER BIRTH ANNIVERSARY TA

ఘనంగా విజయ నిర్మల విగ్రహావిష్కరణ.. హాజరైన కృష్ణ, మహేష్ బాబు..

ప్రపంచంలోనే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్‌‌లో ఎక్కిన విజయ నిర్మల జయంతి వేడుకలు హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఘనంగా జరిగాయి. ఆమె జయంతి సందర్భంగా విజయ నిర్మల కాంస్య విగ్రహాన్ని ఆయన భర్త సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. గిన్నిస్ రికార్డ్ ఫలకాన్ని మహేష్ బాబు ఆవిష్కరించారు. ఈ వేడుకలో విజయ నిర్మల తనయుడు నరేష్‌తో పాటు  రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు, గుంటూరు ఎంపీ కృష్ణ పెద్దల్లుడు గల్లా జయదేవ్‌తో పాటు మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.