Krishna - Venkatesh: హీరో కృష్ణ ఆ సినిమాకు నో చెప్పడంతో వెంకటేష్ హీరో అయ్యారు.. తెర వెనక అసలు కథ విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీలో ఒక హీరో వద్దన్న కథతో వేరే హీరో సినిమా చేసి సక్సెస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా సూపర్ స్టార్ కృష్ణ చేయలేకపోయిన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. (Twitter/Photo)
వెంకటేష్ అసలు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టడం వెనక పెద్ద కథే ఉంది. వివరాల్లోకి వెళితే.. ముందుగా వెంకటేష్‌ను వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు హీరోను చేద్దామనుకోలేదు. అంతేకాదు తన ఇద్దరు కొడుకులైన సురేష్, వెంకటేష్‌లను పెద్ద బిజినెస్ మేన్లుగా తీర్చిదిద్దాలనుకున్నారు.
ఈ విషయమై కృష్ణతో మాట్లాడగా.. ఈ సినిమాను చేస్తాను కానీ.. దీనికి సహ నిర్మాతగా తన బంధువును తీసుకోవాలని రామానాయుడుకు సూచించారట. దీనికి రామానాయుడు ఒప్పులేదు. దాంతో వేరే హీరోతో ఈ సినిమాను తీద్దామని కథానాయకులను వెతుకుతూ ఉండగా.. రామానాయుడు సన్నిహితులు మీ ఇంట్లోనే మీ చిన్నబ్బాయి వెంకటేష్ కూడా ఉన్నాడుగా. హీరోగా చక్కగా సరిపోతాడని సలహా కూడా ఇచ్చారట.
ఈ విధంగా వెంకటేష్.. కలియుగ పాండవులు సినిమాతో వెండితెరకు హీరోగా అనుకోకుండా పరిచయమయ్యారు. ఇక సురేష్ బాబును అనుకున్నా.. ఆయన కెమెరా ముందుకు రావడానికి ముందుకు రాలేదు. దీంతో వెంకటేష్ ఈ చిత్రంతో హీరో అయ్యారు. అప్పటికపుడు వెంకటేష్‌ను విదేశాలను నుంచి రప్పించి నటనలతో పాటు డాన్సులు, డైలాగ్ డిక్షన్స్లో కొత్త శిక్షణ ఇప్పించి ఈ సినిమా ను స్టార్ట్ చేశారు. (Twitter/Photo)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్టైయ్యాయి. మొత్తంగా సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ హీరో అయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కృష్ణ ప్రస్తావించడం గమనార్హం. ఇక సూపర్ స్టార్ కృష్ణతో వెంకటేష్ ఒక్క సినిమాలో కలిసి నటించలేదు. కానీ వెంకటేష్ నటించిన త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున,కృష్ణంరాజు, శోభన్ బాబులతో కలిసి గెస్ట్‌లా మెరిసారు. ఈ సినిమా హిందీలో అమితాబ్, శత్రఘ్న సిన్హా, రిషీ కపూర్లు నటించిన నసీబ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. (Twitter/Photo)
ఇక దివంగత సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వెంకటేష్.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మొత్తంగా అప్పట్లో కృష్ణ ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికాడనే చెప్పాలి. (Twitter/Photo)