‘విశ్వనాథ నాయకుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ ‘విశ్వనాథ నాయకుడు’ పాత్రలో నటించారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు శ్రీకృష్ణదేవరాయులుగా నటించారు. ఎన్టీఆర్ తర్వాత వెండితెరపై శ్రీకృష్ణదేవరాయులుగా కృష్ణంరాజు అద్భుత నటన కనబరిచారు. ఈ చిత్రంలో నడిగర తిలకం శివాజీ గణేషణ్ శ్రీకృష్ణదేవరాయులు సైన్యాధిపతి విశ్వనాథ నాయకుడు తండ్రి నాగమ నాయుడు పాత్రలో నటించారు. (Twitter/Photo)
విశ్వనాథ నాయకుడు చిత్ర కథకు వస్తే.. శ్రీకృష్ణ దేవరాయలకు సైన్యాధిపతిగా ఉండే నాగమనాయకుడు వెన్నుపోటు పొడిస్తే.. ఆయన కొడుకు విశ్వానాథ నాయకుడు తన తండ్రిని పట్టించి శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించి తనకు తండ్రి కంటే రాజభక్తి మిన్న అని చాటిని దేశ భక్తుడి చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’. ఈ పాత్రలో కృష్ణ మంచి అభినయాన్ని కనబరిచారు. (Twitter/Photo)