Super Star Krishna - Nagarjuna Akkineni | సూపర్ స్టార్ తెలుగు సినీ ఇండస్ట్రీలో డేరింగ్, డాషింగ్ డైనమిక్ హీరోగా ఆయన కంటూ తెలుగు సినీ చరిత్రలో ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.ఈయనకు తన తరానికి ముందు ఎన్టీఆర్, అక్కినేనిలతో కొన్ని సినిమాల విషయంలో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత తరంలో నాగార్జునతో చేసిన వారసుడు విషయంలో అభిమానుల మధ్య పెద్ద ఫ్యాన్ వార్ నడిచింది. అవును ఈ సినిమా విషయంలో సూపర్ స్టార్ అభిమానులు పెద్ద రచ్చ నడిచింది. (File/Photo)
ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ డాన్ ధర్మతేజ పాత్రలో నటించారు. ఆయన తనయుడు వినయ్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నాగార్జున.. తండ్రి పాత్రైన కృష్ణ కాలర్ పట్టుకుంటారు. మరి క్లైమాక్స్‌లో కృష్ణ పాత్ర చనిపోతుంది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో హర్ట్ అయ్యారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద రచ్చ జరిగింది. (Twitter/Photo)
సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున ‘వారసుడు’ చిత్రం హిందీలో అజయ్ దేవ్‌గణ్, అమ్రిష్ పురి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. అంతకు ముందు మలయాలంలో మమ్ముట్టి ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ‘పరంపర’ సినిమాకు మూలం. అందులో కృష్ణ.. హిందీలో అమ్రిష్ పురి చేసిన పాత్రలో నటించారు. నాగార్జున.. అజయ్ దేవ్‌గణ్ పాత్రలో నటించడం విశేషం. (Twitter/Photo)