Krishna - Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలయికలో వచ్చిన చిత్రాలు ఇవే..

Super Star Krishna - Mahesh Babu | తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగి పేరు గడించాడు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 9 చిత్రాల్లో కలిసి నటించారు. అందులో బాలనటుడిగా 6 చిత్రాల్లో కలిసి నటిస్తే.. హీరో అయ్యాక మూడు చిత్రాల్లో నటించాడు. ఇంతకీ ఏయే సినిమాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారో మీరు ఓ లుక్కేండి..