తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి మూడు రోజులు అయిన సందర్భంగా చిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు సహా ఇతర కుటుంబ సభ్యులు త్రివిక్రమ్ హాజరై కృష్ణ గారికి నివాళులు అర్పించారు. (Twitter/Photo)
తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..).. తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. (Twitter/Photo)
1983లో ఒకే నెలలో తక్కువ వ్యవధిలోనే విడుదలైన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. 4 సెంటర్లలో నేరుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. సెప్టెంబర్ 1983లో శక్తి, ప్రజారాజ్యం సినిమాలు ఈ రికార్డులు తిరగరాసాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు ఏ హీరోకు కూడా సాధ్యం కాలేదు. అంతేకాదు ఒకేరోజు ‘ఇద్దరు దొంగలు’, యుద్దం వంటి సినిమాలను రిలీజ్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకు దక్కుతుంది. (Twitter/Photo)
25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్గ్రీన్ రికార్డూ కృష్ణకే సొంతం. నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. అలాగే 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. (Twitter/Photo)