Super Star Krishna : తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో సినిమాల విషయంలో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో రియల్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఇపుడు మనమందరం ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కృష్ణ 50 యేళ్ల క్రితమే ప్యాన్ వాల్డ్ మూవీ చేసిన ఘనత కృష్ణకే దక్కుతోంది. (Twitter/Photo)
Super Star Krishna - NSK - Mosagallaku Mosagadu| సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా పద్మాలయా ఫిలింస్ బ్యానర్లో కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై 5 దశాబ్దాలు అవుతోంది. అప్పట్లోనే ఈ చిత్రం ఎన్నో రికార్డులు సాధించింది. (Twitter/Photo)
ఎడారులు, గుర్రపు ఛేజింగ్‌లు, నిధికోసం ఎత్తుకు పై ఎత్తులు, ఎంతో ఉత్కంఠ రేపే కథా కథనాలు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్. మొత్తంగా తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. (Photos/Twitter BARAju)