తెలుగు చలన చిత్ర సీమ పురుడు పోసుకున్న తర్వాత ఎంతో మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక మొదటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలా మెలిగారు. ఆ తర్వాత తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు టాలీవుడ్ త్రిమూర్తులుగా చక్రం తిప్పారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగులో ఓ తరం శకం ముగిసింది. (Twitter/Photo)
సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్లో ఓ తరం శకం ముగిసింది. ఓ నక్షత్రం నేల రాలింది. తెలుగు చలన చిత్ర స్వర్ణ యుగంలో ఓ అధ్యాయం ముగిసిందనే చెప్పాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ తరానికి చిహ్నంగా మిగిలిన ఈయన మృతితో టాలీవుడ్లో ఒకప్పటి టాప్ 5 స్టార్స్ లేరనే విషయాన్ని సినీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. (Twitter/Photo)
1932లో మాట నేర్చిన తెలుగు సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన ఏడేళ్ల అనంతరం రామారావు సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం 'ధర్మపత్ని'. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ 'మనదేశం'.ఎన్టీఆర్ తన అర్థాంగి జ్ఞాపకార్థం బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. అక్కినేని తన జీవిత భాగస్వామి పేరిట అన్నపూర్ణ స్టూడియో కట్టించారు. ఈ అగ్ర నటుల భార్యలు వీరిద్దరి కంటే ముందు కన్నుమూసారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్యలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సోగ్గాడిగా సత్తా చాటారు. ఈయన కాస్త తక్కువ ఏజ్‌లో 2008 మార్చి 20న తన 71వ ఏట కన్నుమూసారు. ఇప్పటికీ ఈయనను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ఈయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే.. టీవీలకు అతుక్కుపోయే వాళ్లున్నారు. అంతలా తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసారు. (Twitter/Photo)
తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..).. తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన క్రియేట్ చేసిన రికార్డులు ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.
మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పంచ పాండవులుగా పిలువ బడే ఎన్టీఆర్, ఏఎన్నార్,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ తరానికి ఎండ్ కార్డ్ వేసారు. మొత్తంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండో తరం అగ్ర హీరోగా ఎంతో మందిని అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణ. మొత్తంగా ఈయన మహాభినిష్క్రమణతో తెలుగు కళామతల్లికి చెందిన ఓ తార నేల రాలిందనే చెప్పాలి. (Twitter/Photo)