తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ తమిళ సై .. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు. అటు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుటు నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణితో కలిసి కృష్ణ పార్దివ దేహానికి అంజలి ఘటించారు.
అటు అల్లు అరవింద్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఇక కృష్ణ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. మొత్తంగా కృష్ణ మృతిపై దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. (Twitter/Photo)
కృష్ణ విషయానికొస్తే.. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. (Twitter/Photo)