Sunny Leone: మరో సౌత్ సినిమాలో సన్నీలియోన్.. ఈసారి రియల్ స్టార్‌తో సెక్సీ బ్యూటీ..!
Sunny Leone: మరో సౌత్ సినిమాలో సన్నీలియోన్.. ఈసారి రియల్ స్టార్‌తో సెక్సీ బ్యూటీ..!
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, నటులు సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం హీరో హీరోయిన్లే కాదు.. స్పెషల్ సాంగ్ చేసే హాట్ బ్యూటీలు కూడా సౌత్ ఇండస్ట్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ సెక్సీ బ్యూటీ మరోసారి సౌత్ సినిమాలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.
చాలా డిమాండ్ ఉన్న దర్శకుడు, నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర తన రాబోయే చిత్రం UI కోసం శాండల్‌వుడ్‌లో షూటింగ్ ప్రారంభించాడు. సెట్స్‌లో ఉపేంద్ర కెమెరా పట్టుకుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
2/ 7
కన్నడ చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నటుడు, దర్శకుడు ఉప్పికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల డిమాండ్ మేరకు దర్శకుడిగా తన 11వ చిత్రంగా యూఐ మూవీని ప్రకటించాడు ఉప్పి. ఏడేళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా మారాడు.
3/ 7
ఈ సినిమా ద్వారా సన్నీ మళ్లీ శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది. గతంలో కొన్ని సినిమా పాటల్లో డ్యాన్స్ చేసిన సన్నీలియోన్ ఈ సినిమా ద్వారా మళ్లీ శాండల్ వుడ్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
4/ 7
హాట్ స్టార్ సన్నీలియోన్ 'యూఐ' సినిమాలోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారని, తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు.
5/ 7
సన్నీలియోన్ పాత్ర షూటింగ్ బెంగళూరులో జరిగింది . ఆమె ఉపేంద్ర తీస్తున్న UI సినిమాలో ప్రధాన పాత్ర పోషించిందని తెలుస్తుంది.. ఇప్పటి వరకు కన్నడ చిత్ర పరిశ్రమలో కేవలం పాటల్లో మాత్రమే కనిపించిన సన్నీ ఈ సినిమాలో చాలా సేపు తెరపై కనిపించనుందని సమాచారం.
6/ 7
సన్నీ కన్నడలో పలు పాటల్లో కనిపించినప్పటికీ జోగి ప్రేమ్ సినిమాలోని శేషమ్మ పాటతో ఫేమస్ అయింది. యూఐ వచ్చాక ఈ సినిమా ద్వారా అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంటాడని అంటున్నారు.
7/ 7
మరోవైపు ఉపేంద్ర పై యూఐ షూటింగ్ సమయంలో ఆయన అనారోగ్యంపై పుకార్లు వచ్చాయి. కానీ తనకేం జరగలేదని స్పష్టం చేశారు కన్నడ రియల్ స్టార్. ఇప్పుడు కుర్రాళ్ల గుండె వేగం పెంచేందుకు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీలియోన్ లాంటి నటితో రియల్ స్టార్ మళ్లీ శాండల్‌వుడ్‌లోకి దర్శకత్వంతో వచ్చాడు,