Sunishith: మంచు ఫ్యామిలీ గొడవల్లో ఎంటరైన సునిషిత్.. అయ్య బాబోయ్ ఎంతమాట!
Sunishith: మంచు ఫ్యామిలీ గొడవల్లో ఎంటరైన సునిషిత్.. అయ్య బాబోయ్ ఎంతమాట!
Manchu Manoj Vs Vishnu: మాటలతో మాయ చేయడంతో సునిశిత్ ని మించినోడే లేడండోయ్. అయితే ఇతగాడు తాజాగా మంచు సోదరుల గురించి, మా ప్రెసిడెంట్ పదవి గురించి మాట్లాడటం విశేషం.
శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. స్టార్ కానేకాదు కానీ ఓ సెలబ్రిటీ కంటే ఎక్కువగా ఫీల్ అవుతూ తెగ పోజులు కొట్టడం మనోడి నైజం. మాటలతో మాయ చేయడంతో ఇతన్ని మించినోడే లేడండోయ్. ఇతగాడు తాజాగా మంచు సోదరుల గురించి మాట్లాడటం విశేషం.
2/ 9
ఓ స్టార్ హీరోయిన్ నన్ను పెళ్లాడింది. మరో స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేశా.. ఆ హీరోయిన్ నాకు లవ్ ప్రపోజ్ చేసింది.. ఇలాంటి నమ్మశక్యం కానీ మాటలు మాట్లాడి ఫేమస్ అయిన సునిషిత్.. ఇప్పుడు మరోసారి అదే బాటలోకి వెళ్లి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
3/ 9
మంచు సోదరులైన విష్ణు, మనోజ్ మధ్య రాజుకున్న వివాదం హాట్ టాపిక్ కావడంతో ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యాడు సునిషిత్. మంచు విష్ణుని అనరాని మాటలు అనడమే గాక మా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా అని ఛాలెంజ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
4/ 9
''ఏరా విష్ణు గా ఇంక నువ్వు మారవా.. అరడజను మంది పిల్లలకు తండ్రివి రా నువ్వు.. అప్పుడు నా సినిమాలు లాక్కున్నావ్.. ఇప్పుడు మనోజ్ ని కొట్టడానికి వెళ్తున్నావు.. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గా నిన్ను కచ్చితంగా ఓడిస్తా..'' అంటూ సునిషిత్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
5/ 9
మంచు విష్ణు - మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తుండగా.. ఉన్నట్టుండి మనోజ్ పెట్టిన ఓ వీడియో సంచలనంగా మారింది. అన్న మంచు విష్ణు ఆగడాలు ఇవీ అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి షాకిచ్చారు మంచు మనోజ్.
6/ 9
బంధువుల ఇంట్లోకి వెళ్లి మరీ మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఇలాగా బంధువుల ఇళ్లలోకి వచ్చి మావాళ్లను, బంధువులను కొడుతుంటారండీ, ఇది సిట్యూయేషన్ అంటూ ఈ వీడియోలో మనోజ్ వాయిస్ వినిపించడం దుమారానికి తెర లేపింది.
7/ 9
తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇంట్లోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణు పై మనోజ్ సీరియస్ కావడం హాట్ టాపిక్ అయింది. మంచు వారింట జరుగుతున్న ఈ గొడవ బట్టబయలు కావడం ఒకెత్తయితే.. ఇందులో సునిషిత్ ఎంటర్ కావడం మరో ఎత్తయింది.
8/ 9
మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవకు సారథి అనే వ్యక్తి కారణం అని తెలుస్తోంది. తొలుత విష్ణు దగ్గర కొన్ని రోజులు పని చేసిన సారథి.. ఆ తర్వాత మనోజ్ కి దగ్గర కావడం, అతనిపై మంచు విష్ణు అటాక్ చేయడం ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న అయింది.
9/ 9
అయితే దీనిపై రియాక్ట్ అయిన విష్ణు.. ఇది చాలా చిన్న గొడవ అని, సారథి వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడని అన్నారు. మనోజ్ చిన్న వాడు.. ఏదో ఆవేశంలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఇష్యూని ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.