తమిళ హిట్ చిత్రం ‘సుందర ట్రావెల్స్’ చిత్రంలో నటించిన నటి రాధ(39) తన భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నూర్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తన భర్త వసంతరాజ వేధిస్తున్నాడని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని, హింసిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాదు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే.. తన కాపురంలో రాధ చిచ్చుపెడుతోందని, తన భర్త పరువు తీసిందని మునివేలు భార్య మీడియా ముందుకొచ్చి రాధను తిట్టిపోసింది. ఇప్పుడు తన రెండో భర్త వసంతరాజపై విరుగంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తనతో పాటు తన తల్లిని కూడా కొడుతున్నాడని వసంతరాజపై ఫిర్యాదులో రాధ పేర్కొంది.