తెలుగు ఇండస్ట్రీకి ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లుగా ఉండేవాళ్లు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు రూల్ చేసారు. వాళ్ళ తర్వాత చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ నాలుగు స్థంభాలుగా ఉన్నారు. 30 ఏళ్ళుగా సత్తా చూపిస్తున్నారు వీళ్లు. అలాంటిది 2021 సమ్మర్ సీజన్లో నలుగురు సీనియర్ హీరోలు తమ సినిమాలతో వచ్చేస్తున్నారు. అందుకే 2021 సమ్మర్ మోస్ట్ స్పెషల్ అవుతుంది.