సుమకు సినిమా అవకాశాలు రావడంతో యాంకరింగ్ కు దూరం కానున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి సుమ స్పందించి ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. తాను యాంకరింగ్ కు ఫుల్ స్టాప్ పెడతానని వైరల్ అయిన ప్రచారంలో నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు.