అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది పుష్ప సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ విషయమై పుష్ప టీమ్‌పై సుకుమార్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
పుష్ప 2 షూటింగ్ ప్రారంభం నుంచే లీకుల బెడద కొనసాగుతోంది. ఇప్పటికే ''అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం'' అనే డైలాగ్ లీక్ అయింది. ఇప్పుడు షూట్ లొకేషన్ స్టిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సుకుమార్ అసంతృత్తికి కారణమైందని టాక్.