'పుష్ప: ది రూల్' పేరుతో రాబోతున్న ఈ సీక్వల్ మూవీని ఏకంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కించడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట సుకుమార్. ప్రస్తుతం అందుకు తగ్గ వ్యూహాలు కూడా రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే బన్నీ రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళుతుందని చెప్పడంలో సందేహమే లేదు.