ముఖ్యంగా బీ,సీ సెంటర్స్లలో ఈ సినిమాకు అపూర్వ స్పందన వస్తోంది. దీంతో తొలి రోజుకు గాను ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన దానికంటే ఎక్కువ వసూళ్లు నమోదు చేశాడు ఈ గాలోడు. థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే కుటుంబంతో కలిసి థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్షకులు. లేకపోతే ఓటీటీలో వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జబర్ధస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ సత్తా చాటారు.