Gaalodu 11 Days Box Office Collections : సుడిగాలి సుధీర్ స్మాల్ స్క్రీన్ పై జబర్ధస్త్ వంటి కామెడీ షోతో పాపులర్ అయ్యారు. అదే ఈయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసింది. ఇప్పటికే ఒక రెండు సినిమాల్లో హీరోగా నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా ఈయన ‘గాలోడు’ సినిమాతో తొలిసారి హీరోగా సక్సెస్ రుచి ఏమిటో చూసాడు. (Twitter/Photo)
గత కొన్నేళ్లుగా చిన్న తెర ప్రేక్షకులను గిలిగింతలు పెడుతున్న సుడిగాలి సుధీర్.. అవకాశం వచ్చిన ప్రతిసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఎలాగైనా ఫేమ్ కొట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్న సుధీర్‌కు ‘గాలోడు’ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నారు. (Twitter/Photo)
గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల అభిరుచుల్లో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రేక్షకులు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు అలవాటు పడ్డారు. ప్రపంచ సినిమాలకు అలవాడు పడ్డారు. ఈ కోవలో ప్రేక్షకులు అది స్టార్స్ నటించిన సినిమాలైనా కథ, కథనం బాగుందనే టాక్ వస్తేనే చూస్తున్నారు. అది కూడా అద్భుతం.. ఇది థియేటర్స్‌లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే కుటుంబంతో కలిసి థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. లేకపోతే ఓటీటీలో వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జబర్ధస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు అన్ని ఏరియాల్లో మొదటి రోజు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. (Twitter/Photo)
టీవీల్లో స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన సుధీర్.. ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాలోడు గా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా 11 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (తెలంగాణ)లో రూ. 3.03 కోట్ల గ్రాస్ రాయలసీమ (నైజాం)లో రూ. 0.93 కోట్ల గ్రాస్ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 3.94 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 7.90 కోట్ల గ్రాస్ (రూ. 4.27 కోట్ల షేర్ ) రాబట్టింది. కర్ణాటక + ఓవర్సీస్ + రెస్టాఫ్ భారత్ - రూ. 18 లక్షలు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.08 కోట్ల గ్రాస్ ( రూ. 4.36 కోట్ల షేర్ ) రాబట్టింది. తెలుగులో రూ. 2.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజిపనెస్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ. 1.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా ఢిజిటల్, శాటిలైట్ రూపేణా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా ఈ సినిమాతో నిర్మాతలు, డిస్ట్రిబ్రూటర్స్ మంచి లాభాలనే గడిస్తున్నారు. (Twitter/Photo)
సుధీర్ నటించిన 'గాలోడు' సినిమాకు చేసిన ప్రమోషన్స్ ఈ సినిమాపై అంచనాలు బాగా పెంచాయి. దీంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నైజాంలో 130, సీడెడ్‌లో 60, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 185 థియేటర్లలో అంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 375 థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి లాభాలతో దూసుకుపోతుంది.
ఇకపోతే ఈ సినిమాలో సుధీర్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంతకుముందు సుధీర్ 3 మంకీస్ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా కంటే ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తో నిర్మించారు. దీంతో ఈ సినిమా కోసం అతను దాదాపు రూ. 40 నుంచి 50 నుంచి లక్షల వరకు పారితోషికం తీసుకున్నారట సుధీర్.