ఇలాంటి తరుణంలో రీసెంట్ గా సుధీర్ గాలోడు సినిమా ప్రమోషన్స్ లో రష్మీ మాట్లాడుతూ.. నా గాలోడిని మీ చేతిలో పెడుతున్నా అనడం జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది. అలాగే తోటి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఓ ఇంటర్వ్యూలో రష్మీ- సుధీర్ రిలేషన్ పై రియాక్ట్ అయిన తీరు జనాల్లోకి అనుమానాలను ఇంకాస్త పెంచేసింది.
ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచడానికి రష్మీ- సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్లాన్ చేసింది రామ్ ప్రసాద్ అని చెప్పిన హైపర్ ఆది.. ప్రస్తుతం ఆ ఇద్దరి రియల్ లైఫ్ రిలేషన్ గురించి కామెంట్ చేయలేను అని చెప్పడం డౌట్స్ పెంచేసింది. ఏదేమైనా రష్మీ- సుధీర్ లవ్ ట్రాక్ తో పాటు పెళ్లి మ్యాటర్ మాత్రం ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొల్పింది. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందనేది!.