నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హంట్. ఈ చిత్రంలో సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా, అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని అందించారు. భవ్య క్రియేషన్స్ (Bhavya Creations) బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గన్స్ డోంట్ లై అనే ఉప శీర్షికతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. మంచి కంటెంట్ ఉన్న ఈసినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. హంట్‌లో చిత్ర శుక్లా హీరోయిన్గా చేసింది. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా ముంబై పోలీస్‌గా రీమేక్ వచ్చింది. చూడాలి మరి ఓటీటీలో ఈ సినిమా ఎలా ఆకట్టుకోనుందో.." width="1000" height="836" /> దీనికి తోడు సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఇంకా రాణించడంతో ఈ సినిమాకు ఆదరణ తగ్గింది. కలెక్షన్స్ కూడా అనుకున్న రేంజ్లో రాలేదు. ఈక్రమంలో ఈసినిమా మరో 10 రోజుల్లో అంటే ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. హంట్‌లో చిత్ర శుక్లా హీరోయిన్గా చేసింది. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా ముంబై పోలీస్‌గా రీమేక్ వచ్చింది. చూడాలి మరి ఓటీటీలో ఈ సినిమా ఎలా ఆకట్టుకోనుందో..
ఇక సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటించిన మరో సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్గా వస్తోన్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ (Aa Ammayi Gurinchi Meeku Cheppali ) ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా మంచి అంచనాల నడుమ 2022 సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
ఈ సినిమాకు (Indraganti Mohana Krishna) మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. సుధీర్ బాబు, కృతి శెట్టిలతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, కునాల్ కౌశిక్ తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్‌గా జనవరి 29, 2023న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో ప్రసారానికి రెడీ అయ్యింది. థియేటర్స్‌లో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం టీవీ తెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. Photo : Twitter
ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinchi Meeku Cheppali) కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇంద్రగంటి మోహనకృష్ణ ఇపుడు ఓ అందమైన ప్రేమకథ తెరకెక్కించాడు. సినిమా బ్యాగ్ డ్రాప్లో వచ్చిన ఈ మూవీ తెలుగువారిని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రెండు రోజులకే చేతులు ఎత్తేసింది. Photo : Twitter
ఇక ఈ సినిమా దర్శకుడి విషయానికి వస్తే.. ఒక్కసారి ఇంద్రగంటి ఎవరైనా హీరోతో కనెక్ట్ అయ్యాడు అంటే వరసగా ఆయనతోనే సినిమాలు చేస్తుంటారు. సుధీర్ బాబు ఇప్పుడు ఆయనకు అలాగే కనెక్ట్ అయ్యాడు. 4 ఏళ్ళ కింది ఈ కాంబినేషన్లో మొదటిసారి సమ్మోహనం సినిమా వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి అప్లాజ్ రావడమే కాకుండా విజయం కూడా అందుకుంది. Photo : Twitter
ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టి నటించారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. Photo : Twitter