బుల్లితెరపై సుడిగాలి సుధీర్ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. సైడ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన కెరీర్ సూపర్ స్టార్ రేంజ్ వరకు వెళ్లింది. ఇప్పుడు బుల్లితెరకు మెగాస్టార్ లెవెల్లో క్రేజ్ వచ్చేసింది. షోలో ఏం ఉన్నా లేకపోయినా సరే సుడిగాలి సుధీర్ ఉంటే చాలు అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. సుధీర్ కనిపిస్తే చాలు అని అభిమానులు అంటుంటారు. అయితే ఈ మాట కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సగటు బుల్లితెర ప్రేక్షకుడూ అంటున్నాడు.
జబర్దస్త్‌లో వస్తోన్న మార్పులు, మారుతున్న టీం లీడర్ల సమయంలోనే సుధీర్‌కు అద్భుతమైన ఆఫర్ వచ్చింది. టీం లీడర్‌గా ఎదిగిపోయాడు. సుడిగాలి సుధీర్ అనే టీంను టాప్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ ప్రయాణంలో సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్‌లు మరింత దగ్గరయ్యారు. వారి స్నేహంతో పాటే వారి క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది.
జబర్దస్త్ షోలో వేణు వండర్స్ టీంలో సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ ఎంట్రీ కూడా విచిత్రంగానే జరిగింది. వేణు ఇచ్చిన డైలాగ్స్‌ను సుధీర్ క్షణాల్లో చెప్పేయడంతో వెంటనే నచ్చేశాడట. అలా జబర్దస్త్ ప్రయాణం వేణు ద్వారా మొదలైంది.అయితే కొద్ది కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. అక్కడే సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ త్రయం కూడా ఏర్పడింది.
అయితే సుధీర్ ఈ క్రమంలో తన సంపాదనను కూడా పెంచేసుకున్నాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి ఢీ వరకు .. ఢీ నుంచి శ్రీదేవీ డ్రామా కంపెనీ వరకు సుధీర్ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉన్నాడు. లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు అంటూ పెంచుకుంటూనే పోయాడు. చివరకు ఐదు లక్షల ఉన్న సమయంలో మల్లెమాల నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఒక వేళ సుధీర్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడంటే.. బుల్లితెరపై తిరుగులేని మెగాస్టార్ అన్నట్టే. అయితే సుధీర్ బుల్లితెరపై తన సత్తాను చాటుతున్నాడు. కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోతోన్నాడు. హీరోగా నిలబడేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాలింగ్ సహస్ర, గాలోడు వంటి చిత్రాలతో సుధీర్ తన అభిమానులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు.