Kashmir: కాశ్మీర్లో స్టార్ హీరో షూటింగ్.. రాళ్లతో దాడి.. ?
Kashmir: కాశ్మీర్లో స్టార్ హీరో షూటింగ్.. రాళ్లతో దాడి.. ?
నటుడు ఇమ్రాన్ హష్మీ కాశ్మీర్లో ఓ సినిమా షూటింగ్లో ఉండగా చిత్ర బృందంపై రాళ్ల దాడి జరిగింది. దీంతో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఎలా ఉన్నాడు? అని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆ హీరో సోషల్ మీడియాలో స్పందించాడు.
imranbollyw బాలీవుడ్ అగ్ర నటుడు ఇమ్రాన్ హష్మీ చిత్ర బృందంపై రాళ్లు రువ్వడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. బాలీవుడ్లో రొమాంటిక్ కిస్సింగ్ సీన్స్‌తో ఫేమస్ అయిన ఈ నటుడు కాశ్మీర్లో షూటింగ్ చేస్తున్నారు.
2/ 8
ఈ ఘటనలో ఇమ్రాన్ హష్మీ గాయపడినట్లు పుకార్లు వచ్చాయి. అలాంటి వార్తలు అవాస్తవమని నటుడు మంగళవారం ట్విట్టర్లో స్పష్టం చేశారు.
3/ 8
ఇమ్రాన్ ప్రస్తుతం కాశ్మీర్లో మరాఠీ చిత్రనిర్మాత తేజస్ విజయ్ దియోస్కర్ యొక్క గ్రౌండ్ జీరో షూటింగ్లో ఉన్నాడు.
4/ 8
మంగళవారం ఉదయం ఇమ్రాన్ ట్వీట్ చేస్తూ.. ‘‘కశ్మీర్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.. మమ్మల్ని సాదరంగా స్వాగతించారు. రాళ్లదాడి ఘటనలో నేను గాయపడ్డానన్న వార్తలు అవాస్తవం.
5/ 8
ఇక ఇమ్రాన్ అభిమానులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ట్వీట్‌కు ప్రతిస్పందించారు, మరికొందరు అతను క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆనందం వ్యక్తం చేశారు.
6/ 8
మీరు బాగా ఉన్నారని తెలిసి ఆనందంగా ఉంది' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ మరో ఫ్యాన్ ట్వీట్ చేశారు.
7/ 8
ఇమ్రాన్ ప్రస్తుతం గ్రౌండ్ జీరో సినిమా షూటింగ్లో ఉన్నాడు. గత నెలలో కాశ్మీర్‌కు చేరుకున్న ఆయన గత కొన్ని వారాలుగా అక్కడే షూటింగ్లో ఉన్నారు.
8/ 8
అంతకుముందు, పహల్గామ్లో చిత్ర బృందంపై రాళ్లు రువ్వినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ANI నివేదిక తెలిపింది. సెప్టెంబర్ 18న పహల్గామ్లో తమ సినిమా షూటింగ్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.