Sridevi Vijaykumar: టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్ కుమార్. తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తొలిసారిగా రుక్మిణి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఈశ్వర్ సినిమాలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరికొన్ని సినిమాలలో సహాయ పాత్రల్లో కూడా నటించింది. ప్రస్తుతం బుల్లితెరలో ఓ షోలో జడ్జిగా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలతో బాగా సందడి చేస్తుంది. అంతే కాకుండా తన పాపతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది. ఇక తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో తన కూతురుతో సరదాగా ఆడుతూ కనిపించింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు శ్రీదేవి ఇంకా యంగ్ గానే కనిపిస్తుందని పొగుడుతున్నారు.