రోషన్ మేక.. తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన మరో వారసుడు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడుగా వచ్చిన రోషన్.. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. నిజానికి నాలుగేళ్ల కింద నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయం అయినా కూడా అప్పటికి మనోడికి కేవలం 17 ఏళ్లు మాత్రమే. దాంతో ఈ సినిమాను మొదటి సినిమాలా అస్సలు కన్సిడర్ చేయలేదు శ్రీకాంత్. అదేదో టైమ్ పాస్ కోసం హాలీడేస్ సమయంలో చేసాడని చెప్పుకొచ్చాడు.
తన కొడుకును సీరియస్‌గా పరిచయం చేసింది మాత్రం పెళ్లి సందD సినిమాతోనే. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకీ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. ముఖ్యంగా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ చిత్రం దాదాపు 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసి.. నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా మంచి లాభాలు తీసుకొచ్చింది. దసరా హాలీడేస్‌ను బాగా వాడుకుని రోషన్ మేక కోరుకున్న డెబ్యూ ఇచ్చింది. అయితే ఈ చిత్రం వచ్చి 5 నెలలు అవుతున్నా కూడా మొన్నటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు రోషన్.
ఈయన రెండో సినిమా ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. మొన్న మార్చ్ 13న ఈయన పుట్టిన రోజు సందర్భంగా రెండో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు రోషన్. ప్రతిష్టాత్మక వై జయంతి మూవీస్‌లో రెండో సినిమా చేయబోతున్నాడు రోషన్. గతంలో శ్రీకాంత్ కెరీర్‌కు కూడా పర్ఫెక్ట్ బ్రేక్ ఇచ్చిన సంస్థ ఇదే. అప్పట్లో వై జయంతి, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన పెళ్లి సందడి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు శ్రీకాంత్. ఇప్పుడు ఈయన తనయుడు కూడా రెండో సినిమాను అదే నిర్మాణ సంస్థలో చేయబోతున్నాడు.
పెళ్లి సందD విజయం సాధించడంతో.. రోషన్ రెండో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాను ప్రదీప్ అద్వైతం తెరకెక్కించబోతున్నాడు. విభిన్నమైన కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఇందులో ఓ లీడింగ్ హీరోయిన్ రోషన్‌తో జోడీ కట్టబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది.
ప్రదీప్ అద్వైతం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అద్వైతం అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు రోషన్ సినిమాతో ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ సినిమా స్వాతంత్రానికి పూర్వం కథతో రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రోషన్ తన వయసుకు మించిన పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇది పూర్తిగా గన్స్ ప్రధానంగా సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో గన్ డీలర్ పాత్రలో రోషన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.
పెళ్లి సందD సినిమాలో ముద్దుముద్దుగా కనిపించిన ఈయన.. ఇప్పుడు అంతేకాదు ప్రదీప్ అద్వైతం సినిమాలో మరో సెన్సేషనల్ పాయింట్ కూడా ఉంది. క్లైమాక్స్‌లో హీరో చనిపోతాడనే న్యూస్ బయటికి వచ్చింది. ఇదిలా ఉంటే వై జయంతి మూవీస్‌లో ఇప్పుడు ప్రభాస్ హీరోగా 400 కోట్ల బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదే సంస్థ నుంచి ఇప్పుడు రోషన్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా రాబోతుంది.