కొంతమంది సోషల్ మీడియాను తప్పుగా వాడుతున్నారని, ముఖ్యంగా యూట్యూబర్స్ వీడియోలకు పెట్టే థంబ్నైల్స్ చూస్తుంటే చాలా బాధేస్తోందని శ్రీకాంత్ అన్నారు. నేను చనిపోయినట్టు రాశారు.. ఊహతో విడాకులు అని రాశారు. ఇలాంటివి ఫ్యామిలీని చాల ఇబ్బంది పెడతాయని చెప్పారు. తాను తట్టుకున్న ఫ్యామిలీ మెంబెర్స్ తట్టుకోలేరని శ్రీకాంత్ అన్నారు.