ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పూటించారు. ఇప్పుడేమో ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ మరో రూమర్ తెరపైకి తెచ్చారు. ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను ఈ విషయాన్ని నా వరకు తెచ్చింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు అన్నారు శ్రీకాంత్.
కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ ప్రసారం చేసిన ఈ న్యూస్ పై బంధువులు ఫోన్ చేసి అడుగుతుంటే.. వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తోంది. నిన్ననే ఊహ, నేను చెన్నై వచ్చి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో వస్తున్న ఈ వార్తలు చిరాకు తెప్పిస్తున్నాయి అని శ్రీకాంత్ అన్నారు.