ఇప్పుడు మరోసారి పునీత్ రాజ్‌కుమార్ హీరోగా వస్తున్న జేమ్స్లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో శ్రీకాంత్ కనిపించబోతున్నాడు. చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కిషోర్ పత్తికొండ నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మొత్తానికి కన్నడలో కూడా బిజీ అవుతున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే మలయాళంలో కూడా విలన్ అనే సినిమాలో నటించాడు శ్రీకాంత్.