Sridevi - Tamannaah - Kajal : శ్రీదేవి, తమన్నా, కాజల్ మధ్య ఉన్న ఈ విచిత్రమైన పోలిక తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. దివంగత శ్రీదేవి.. ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీల్లో సత్తా చాటింది. శ్రీదేవి తెలుగు అమ్మాయిగా హిందీలో సత్తా చాటితే.. నార్త్ అమ్మాయిలైన తమన్నా, కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళంలో సత్తా చాటారు. వీళ్ల మధ్య ఒక చిత్రమైన అనుబంధం ఉంది. (Twitter/Photo)
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్... తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. అందులో శ్రీదేవి, కాజల్, తమన్నాతో పాటు పలువురు కథానాయికలున్నారు. ఇంతకీ సిల్వర్ స్క్రీన్ పై తండ్రి కొడుకుల సరసన హీరోయిన్స్ విషయానికొస్తే.. (File/Photo)
ముందుగా ఎన్టీఆర్, బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్స్ విషయానికొస్తే..ముందుగా ఆ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి ఉంటుంది. ఈ భామ...ఎన్టీఆర్‌తో ‘కలియుగ రాముడు’ ‘ప్రేమ సింహాసనం’ వంటి రెండు మూడు సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఈ భామ బాలకృష్ణ సరసన ‘శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. (Twitter/Photo)
ఎన్టీఆర్,బాలకృష్ణ సరసనే కాదు...ఏఎన్నార్,నాగార్జున సరసన నటించిన హీరోయిన్గా రాధా రికార్డులకు ఎక్కింది. రాధా అక్కినేని నాగేశ్వరరావు సరసన ‘ఆదర్శవంతుడు’, ‘వసంత గీతం’ ‘గోపాల కృష్ణుడు’ వంటి సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత రాధ అక్కినేని కుమారుడైన నాగార్జునతో ‘విక్కీదాదా’ సినిమాలో నటించి మెప్పించడం విశేషం.(File/Photos)
రాధ అటు తెలుగులోనే కాదు తమిళ్లో కూడా హీరోలైన తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసింది. అలా తమిళంలో శివాజీ గణేషన్, ప్రభుల సరసన యాక్ట్ చేసిన ట్రాక్ రికార్డు రాధ సొంతం. ఆమె శివాజీ గణేషన్‌తో ‘ఆత్మ బంధువు’ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఈ నడిగర్ తిలకం కొడుకైన ప్రభుతో కూడా రాధ హీరోయిన్గా నటించి మెప్పించింది.
మళ్లీ తెలుగు విషయానికొస్తే.. తండ్రీ కొడుకలైన కృష్ణ, రమేష్ బాబుల సరసన నటించిన హీరోయిన్స్ కూడా చాలా మందే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణతో ‘గూడచారి 117’ వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించిన భానుప్రియ... ఆయన కొడుకైన రమేశ్ బాబు హీరోగా నటించిన ‘బ్లాక్ టైగర్’ సినిమాలో కథానాయికగా నటించింది. (Twitter/Photo)