Anandhi Kayal : తెలుగులో ఈ రోజుల్లో సినిమాలో... సెల్ సాంగ్‌లో కనిపించిన ఈ బ్యూటీ... ఆ తర్వాత బస్టాప్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నెక్ట్స్ ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాలు చేసిన ఆనంది... తర్వాత కోలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ ఇప్పటికే 12 సినిమాలు చేసిన ఆనంది... మరో 6 తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇవన్నీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. అందానికి తోడు... సహజ నటనతో అందర్నీ ఆకట్టుకుంటూ... విమర్శకుల ప్రశంసలు పొందుతూ... కెరీర్ గ్రాఫ్‌ను డెవలప్ చేసుకుంటోంది ఆనంది.. Photo : Instagram
తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌తో ఆమె ప్రేమలో పడిన ఆనంది.. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరి 7న ప్రియుడిని వివాహం చేసుకుంది. అయితే ఆనంది త్వరలోనే తల్లి కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణిగా ఉందని సమాచారం. త్వరలోనే కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం కూడా చేయబోతున్నారట Photo : Instagram