Sushmita Konidela - Sridevi Shoban Babu | మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె నిర్మాతగా మారి ఫస్ట్ మూవీగా సంతోష్ శోభన్ హీరోగా గౌరీ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ లాంఛ్ ఈ బుధవారం జరిగింది. (Twitter/Photo)
80లలో శోభన్ బాబు, శ్రీదేవి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి జోడికి ప్రేక్షకుల్లో అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అందుకే సుస్మిత ఇపుడు తాను నిర్మాత తెరకెక్కిస్తోన్న ఫస్ట్ 0 సినిమాకు ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే టైటిల్‌తో తెరకెక్కించి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనేలా చేసారు. (Twitter/Photo)
శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో ‘ఏక్ మినీ కథ’ సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా నటించారు. హీరోయిన్గా జాను ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో గౌరీ ట్రెండీ లుక్‌లో కనిపిస్తే.. హీరో సంతోష్ శోభన్ ఫార్మల్ షర్ట్‌తో రఫ్ లుక్‌తో ఉన్నారు. తాజాగా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
మొత్తంగా క్యాచీ టైటిల్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రంతో నిర్మాత సుస్మిత కొణిదెల నిర్మాతగా అపుడే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిత్తించింది. ఆ మధ్య సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. అందులో భాగంగా సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. (Twitter/Photo)
ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ జీ5లో ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆ వెబ్ సిరీస్ తర్వాత సుస్మిత నిర్మాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాను నిర్మించారు. త్వరలో తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్, తమ్ముడు రామ్ చరణ్‌లతో పాటు మిగతా మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు మెగా డాటర్ సుస్మిత. ఈ టీజర్ లాంఛ్‌కు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. (Twitter/Photo)