శ్రీదేవి , రేణు దేశాయ్ కంటే గర్భం దాల్చిన సినీ సెలబ్రిటీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మన దేశంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పిల్లలు కనడం అనేది పెళ్లి తర్వాతే. తర తరాలుగా అదే కొనసాగుతోంది. కొంత మంది మాత్రం ఈ ఆచారాలను బ్రేక్ చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో పాటు పిల్లలను కన్నారు. అందులో శ్రీదేవి, రేణు దేశాయ్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. (Twitter/Photo)
పెళ్లి కాకుండానే తల్లి కావడాన్ని కూడా ఓ ప్రస్టేజ్గా తీసుకుంటున్నారు మన ముద్దుగుమ్మలు. తెలుగు నుంచి హిందీ ఇండస్ట్రీ వరకు చాలా మంది హీరోయిన్లు పెళ్లికి, తల్లి కావడానికి అస్సలు లింక్ పెట్టుకోవడం లేదు. ఈ మధ్యే అమీజాక్సన్, కల్కి కొచ్లిన్ కూడా ఇదే చేసారు. పెళ్లి కాకుండానే వాళ్లు గర్భం దాల్చారు. అడిగితే పెళ్లికి, తల్లి కావడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు.(Twitter/Photo)