అదే రొమాంటిక్ నెస్. అమ్మాయి కనిపిస్తే చాలు ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్లుగా తెగ ఊగిపోతుంటాడు ఈ జబర్దస్త్ కమెడియన్. వేదికపై ఎన్నోసార్లు రొమాంటిక్ స్కిట్స్ వేసి సక్సెస్ అయిన హైపర్ ఆది.. యాంకర్ అనసూయతో అయితే ఆన్ స్క్రీన్ రొమాన్స్ దండిగా పండించాడు. ఈ ఇద్దరికి సంబంధించిన బోలెడన్ని డాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.
శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్‌గా ఉండాలంటే ముందు అన్నకు ఓ హగ్గు ఇవ్వాలంటూ రామ్ ప్రసాద్‌ని చూపించాడు హైపర్ ఆది. దీంతో ఆ మాటకు బదులిచ్చిన పూర్ణ వెంటనే ఓపెన్ అయింది. ఈ హగ్గులు ఇవ్వలేకే ఢీ షో వదిలేశా.. ఇప్పుడు ఇక్కడ కూడా హగ్గులు అంటే ఇది కూడా మానేస్తా అని చెప్పేసింది పూర్ణ. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.