టీడీపీ వాళ్లు మిమ్మల్ని పిండి వదిలిపెడతారని ఎప్పుడో చెప్పా.. దివ్యవాణికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసు అనేసింది శ్రీ రెడ్డి. టీడీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న మీరు వేరే పార్టీ వాళ్లని వేసుకుంటారని అనుకుంటే.. మీ పార్టీ వాళ్లనే దుమ్ముదులిపారు. అది చాలా బాగా నచ్చిందని శ్రీ రెడ్డి చెప్పింది.
తూ నీ బతుకుచెడ అని మీరు అన్నారు చూడూ.. దానికి చంద్రబాబు ఏడవడాన్ని యాడ్ చేసి ట్రోల్ చేయడం చాలా ఫన్నీగా అనిపించింది. నవ్వుకోలేక చస్తున్నాం అని చెప్పిన శ్రీ రెడ్డి.. టీడీపీలో ఇలాంటి పరిస్థితి ఇంకా చాలా మందికి వస్తుందని అనేసింది. ఇప్పటికైనా అర్ధమైందా? దివ్య వాణి గారు అంటూ శ్రీ రెడ్డి ఫైరింగ్ కామెంట్స్ చేసింది.