Sri Rama Navami: సిల్వర్ స్క్రీన్ పై రామబాణం.. తెలుగు సినీ అయోధ్యలో రాముడు పేరున్న కథానాయకులు..

Sri Rama Navami 2021 | హీరోలందరికీ హీరో ఎవరో తెలుసా ? శ్రీరాముడు. అవును... ఇప్పటికీ అత్యధిక శాతం భారతీయులకి హీరో అంటే రాముడే. జగదేక వీరుడైన రాముడు ఏం చేసినా అది అద్భుతమే కాదు అమోఘమే. అందుకే మన దేశంలో చాలా మంది తమ కొడుకులకి రాముడు పేరు పెట్టుకుంటారు. మరి అలాంటి ఆల్ టైం హీరో అయిన రాముడి పేరుతో వెండితెరపై అలరిస్తున్న హీరోలెవరున్నారో చూద్దాం..