ఇక మనతెలుగు చిత్రాల్లో రాముడికి ప్రత్యేక స్థానం వుంది.అలాంటి మహోన్నత పాత్రను నటించి మెప్పించిన నటులెవరో చూద్దాం. తింటే గారాలే తినాలి. వింటే భారతం వినాలి. కంటే రామాయణం కనాలన్న సూత్రాన్ని ఫాలో కావడం భారతీయులకున్న అలవాట్లలో కొన్ని. అందునా తెలుగువాళ్లకు రాముడంటే వల్లమాలిన అభిమానం. అలనాటి ‘లవకుశ’ నుంచి నేటి ‘శ్రీరామరాజ్యం’ వరకు రామగాధను గానం చేసినవే. రాముడి గొప్పతనాన్ని తెలిపినవే.(Twitter/Photo)
త్వరలో తెలుగు తెరపై రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభు శ్రీరామ్ పాత్రలో కనిపించునున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు అల్లు అరవింద్ కూడా ‘రామయణం’ మూవీ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అందులో హీరోగా ఎవరు నటిస్తున్నారనేది చూడాలి. (Pabhas Fan Made Photo : Twitter)
అసలు తెలుగు సినిమా పౌరాణికాలతో ప్రారంభమయింది. రామకథతో వచ్చిన తొలి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కొంత మంది నటులు రాముని పాత్రలో కనిపించిన...తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికే రాముడంటే ఎన్టీఆరే. (Twitter/Photo)
వెండితెర శ్రీరాముడిగా ప్రశంసలు అందుకుని రాముడంటే ఇలాగే ఉంటాడా....అనిపించే స్థాయిలో నటించిన ఘనత ఎన్.టి.ఆర్ కే దక్కుతుంది.అసలు రామచంద్రుడి క్యారెక్టర్ చాలా ఉన్నతమైనది. ఆ పాత్రలో ఓ స్వచ్చత, ఓ సచ్చీలత, ఓ శాంత గుణం కనిపించాలి. శ్రీరాముడి పాత్రకు ఏ మేరకు నటించాలో అంతగా నటించి అద్భుతం అనిపించారు ఎన్టీఆర్. సీతా వియోగ ఘట్టంలో విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్ని ఇలా నవరసాలను మేలవించి శ్రీరాముడి పాత్రలో లీనమై నటించారు ఎన్టీఆర్. (Youtube/Credit)
ఇక శ్రీ రాముడిగా శోభన్ బాబుది ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే చెల్లింది. ఈసినిమాలో రామయ్య తండ్రీ...ఓ రామయ్య తండ్రీ...మా సామీ వంటి నీవేలే రామయ్య తండ్రీ...అంటూ వచ్చే పాట ఇప్పటికీ తెలుగువారి మదిలో దేవుడిగా రాముని ఔన్నత్యాన్ని తెలుపుతునే వుంది. (Youtube/Credit)
రామాయణం అంటే రాముడి నడిచిన మార్గం అనే అర్థం వుంది. తండ్రి మాట కోసం రాముడు వనవాసం చేశాడు. ఇంతలో సతాపహరణం జరిగింది. రావణ సంహారం చేసి సీతను కైవసం చేసుకుంటాడు రాముడు. ఇదీ మూడు ముక్కల్లో రామాయణం. ఇక నవతరం నాయకుల్లో శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించడం విశేషం. (Youtube/Credit)