Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అంతేకాదు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచారు. ఇక 2023లో ఈమె పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం. (Sreemukhi Photo : Instagram
శ్రీముఖి విషయానికొస్తే.. ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో ఈమె అదరగొడుతూనే ఉంది. ఇక స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో యాంకర్‌గా దూసుకుపోతుంది. ఇపుడు ఈమె బడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతన్నట్టు సమాచారం. Photo : Instagra
ఇక ఆ మధ్య కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్లో శ్రీముఖి పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంకా స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. 2023లోనే శ్రీముఖి పెళ్లికి రెడీ అవుతున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈమె చేసుకోబోయే వాడు హైదరాబాద్‌లో సెటిలైన పెద్ద బిజినెస్ మ్యాన్ అనే టాక్ నడుస్తోంది. అతనకి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. Photo : Instagram