Home » photogallery » movies » SREEMUKHI AND RAHUL COMES BACK AND CELEBRATES THEIR RELATIONSHIP AND SHARES A PIC ON INSTA SR

అసలైన రిలేషన్‌షిప్ ఇప్పుడు మొదలైంది : శ్రీముఖి

Sreemukhi : శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కాగా బిగ్ బాస్ తెలుగు 3లో రన్నరప్‌గా శ్రీముఖి నిలిస్తే.. రాహుల్ విన్నర్‌ అయ్యాడు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం శ్రీముఖి, రాహుల్‌‌లు ఎడమొహం పెడమొహంగా ఉన్న విషయం తెలిసిందే. అది అలా ఉంటే.. తాజాగా శ్రీముఖి ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్ ఫుల్‌గా ఊగుతూ డ్యాన్స్ అదరగొట్టారు. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు సద్దుమణిగి.. పూర్వ స్థితికి వచ్చారని సంతోషిస్తున్నారు వారి అభిమానులు. ఇదే విషయాన్ని శ్రీముఖి కూడా ప్రస్తావిస్తూ.. గతం గత: .. ఇక ఇప్పడే అసలైన రిలేషన్ షిప్ మొదలైందని.. పేర్కోంది.